పుష్ప 2 మూవీకి మొదటి రోజు రికార్డ్ స్థాయిలో స్క్రీన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఊహించని నంబర్ చూడబోతున్నారు!

Pushpa 2 movie is going to gets record number of shows on release day

మరికొన్ని రోజుల్లో "పుష్ప: ది రూల్" మూవీ రిలీజ్ అవ్వబోతుంది. వరల్డ్ వైడ్ గా కానీ విని ఎరుగని రేంజ్ లో ఈ సినిమాపై హైప్ పెరుగుతుంది. ఎప్పటినుంచో ఉన్న డౌట్ లకు రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ చెక్ పెట్టింది. పుష్ప 3 మూవీకి కూడా లీడ్ ఉందని తెలిసింది. సో ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేదు. మూవీ విడుదలకి కొన్ని రోజులు మాత్రమే వున్నాయి. ఒక పక్క షూటింగ్ జరుగుతూనే ఉంది. మరో పక్క ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ కి ప్లానింగ్స్ రెడీ చేస్తుంది మూవీ టీమ్. మూవీ టీమ్ అంత ఈ పనుల్లో బిజీగా ఉన్నారు. పైగా విడుదల తేదీ ఒక రోజు ముందుకు జరిగింది. ఒక రోజు ముందుకు జరగడంతో మామూలుగానే ఒక రేంజ్ లో ఉన్న హైప్ తారా స్థాయికి చేరింది. 

పుష్ప ది రూల్ విడుదల సమయానికి వేరే సినిమాలు పోటీలో లేకపోయినప్పటికీ లాంగ్ వీకెండ్ వాడుకోవడం కోసం ఒకరోజు ముందే విడుదల చేస్తున్నారు. ఓపెనింగ్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ కు ఇది బాగా కలిసొచ్చే అంశం. ఓపెనింగ్ డే కలెక్షన్స్ కోసం కూడా భారీ ప్లాన్ రెడీ అవుతుంది. విడుదల రోజు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో మోవీని ప్లే చేయడంతో పాటు, మిడ్ నైట్ షోస్, బెనిఫిట్ షోస్ రికార్డ్ స్థాయిలో ఉంటే ఫస్ట్ డే కలెక్షన్స్ లో సరి కొత్త రికార్డ్ లు పుడతాయి. మూవీ టీమ్ కూడా దీన్నే ఫాలో అవుతుంది. ఇప్పటివరకు ఏ సినిమాకు కనివిని ఎరుగని రీతిలో పుష్ప 2 సినిమాను రికార్డ్ లెవల్లో వరల్డ్ వైడ్ గా 11500 స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. విడుదల సమయం దగ్గర పడే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. 

ఏపీలో, నైజాం లో కూడా మిడ్ నైట్ 1:AM నుంచే షోస్ స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఓన్లీ హైదరాబాలో మాత్రమే రికార్డ్ స్థాయిలో షోస్ పడనున్నాయి. ఇలా చూస్తే పుష్ప 2 మూవీకి మొదటి రోజు షోస్ కౌంట్ భారీగా ఉండబోతుంది. ఇంకా ట్రైలర్ విడుదల కాలేదు. ట్రైలర్ విడుదల అయిన తర్వాత హైప్ ఇంకా పెరిగి పోతుంది. ఐటం సాంగ్ షూట్ కూడా ఇంకా బాలెన్స్ ఉంది, దానిని నవంబర్ మొదటి వారంలో పూర్తి చేస్తారని సమాచారం. ఈ సాంగ్ బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ చేయబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీపావళి నుంచి అప్డేట్స్ మొదలయ్యే అవకాశం ఉంది. 

0/Post a Comment/Comments