తెలుగు ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR, దేవర సినిమాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా తన ప్రతిభను చూస్తున్నారు. ఆల్రెడీ వార్2 సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు, కానీ వాటిని బాలీవుడ్ లో అందరు చూస్తారని గ్యారెంటీ లేదు. కానీ ఇప్పుడు తారక్ తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు వార్ 2 అనే స్ట్రెయిట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. యాక్షన్ , ఛేంజింగ్ సీన్స్ తో పాటు హృతిక్ రోషన్ తో కలిసి ఒక పాటలో కూడా తారక్ పాల్గొంటాడు అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మూవీ మీద కంప్లీట్ ఫోకస్ తో ఉన్నాడు.
పైగా.. ఇప్పటికే ఎన్టీఆర్ టాలెంట్ చూసిన వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ యాక్షన్ సీన్స్ లో , డైలాగ్స్ చెప్పడంలో తారక్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడట. కేవలం తనకు ఏం కావాలి అనేది మాత్రమే డైరెక్టర్ చెప్తున్నారట. ఇక జనవరి వరకు వీరిద్దరి మధ్య షూట్ కొనసాగుతుంది. వార్ మూవీ అంత హిట్ కాకపోయినా వార్ 2 ను స్టార్ట్ చేశారు మేకర్స్. వార్ 2 మూవీని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ది నెగిటివ్ రోల్ అయినా.. తన రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వార్ 2 మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇది మల్టీస్టారర్ గా బాగా బజ్ తెచ్చుకున్న ఈ మూవీలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ క్యామియో కూడా ఉండబోతుందట. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడట. దాదాపు 15 నిమిషాల పాటు షారుక్ ఖాన్ పఠాన్ రోల్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే అందుకు కావలసిన షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో షారుక్ ఒక ఛేజింగ్ సీన్ లో ఉంటాడని, షారుఖ్ ఖాన్-ఎన్టీఆర్ మధ్య ఫేస్ టు ఫేస్ ఒక యాక్షన్ సీన్ కూడా ఉండేలా ప్లాన్ చేశారట దర్శకుడు. దీనితో ఇప్పుడు తారక్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా కనుక భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం.. ఇక బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు తిరుగు ఉండదు. ఇప్పటికే స్పై యూనివర్స్ వల్ల ఈ వార్ 2 సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంవత్సరం చివరికి సినిమా నుంచి ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్ఛే అవకాశం ఉంది.
Post a Comment