పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల..?

పుష్ప 2 మూవీ సరిగ్గా ఇంకో నెల రోజులలో విడుదల కాబోతుంది. ఆ సినీమా ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు తెలుగు సినిమా లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఐటం సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సాంగ్ కోసం మొదట త్రిప్తి డిమ్రి పేరు వినిపించింది, ఆతర్వాత శ్రద్ధా కపూర్‌ పేరు కూడా  తెగ వైరల్ అయింది. దాదాపు ఈ బాలీవుడ్ భామ కన్ఫర్మ్ అనే అనుకున్నారంత. శ్రద్ద కపూర్ కూడా ఈ సాంగ్ కి ఒకే చెప్పినట్లు, ఇంకా షూట్ మాత్రమే బ్యాలెన్స్ అన్నట్లు టాక్ వచ్చింది. ఇంకా ఈ సాంగ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న  ప్రేక్షకులకు దర్శకుడు సుకుమార్ ఓ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ, ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ను సంప్రదించారట మేకర్స్ .

మూవీ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, దాదాపు అగ్రిమెంట్స్ పూర్తయ్యాయని సమాచారం. పుష్ప పార్ట్ 1 లో సమంత చేసిన సాంగ్ కి కూడా ఆమె పేరు లేట్ గానే బయటకు వచ్చింది. సోషల్ మీడియా లో కూడా ఇప్పుడు శ్రీలీలతో పుష్పరాజ్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. బన్నీ తో కలిసి శ్రీలీల ఒక ఐటం సాంగ్ కి స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తో కలిసి శ్రీలీలే చేసిన "కుర్చీ మడత పెట్టి" సాంగ్ ఎలాంటి సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు. శ్రీలీల డాన్స్ కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక అల్లు అర్జున్ డాన్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్లిద్దరు కలిసి ఒక ఐటం సాంగ్ లో డాన్స్ చేస్తే థియేటర్ లు దద్దరిల్లటం ఖాయం. దీని గురించి అధికారిక ప్రకటన వస్తే.. అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

ఇక దాదాపు ఈ సినిమాకు అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే. అలాగే ఓవర్సీస్ లో ఆల్రెడీ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇక ఆంధ్ర, తెలంగాణ లో  ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్ షోస్ మొదలవుతాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్లు ట్రేడ్ వర్గాల మతులు పోగొడుతున్నాయి. అటు నార్త్ లో కూడా మంచి బజ్ ఊపండుకుంటుంది. ఇక ఈ సాంగ్ షూటింగ్ కాస్త పూర్తయితే.. అప్డేట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వస్తాయి. 

0/Post a Comment/Comments